ఉద్యోగుల‌కు షాక్.. కొత్త పీఆర్సీ ప్ర‌కారమే బిల్లుల ప్రాసెస్ ఉత్త‌ర్వులు జారీ

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది. కొత్త పీఆర్సీ అనుగుణంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ కు సంబంధించిన బిల్లులు ప్రాసెస్ చేయాల‌ని ఆదేశిస్తూ మ‌రో సారి ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. అయితే పీఆర్సీని వ్య‌తిరేకిస్తు ఏపీ ఉద్యోగ సంఘాలు, పీఆర్సీ సాధ‌న స‌మితి ఆందోళ‌న చేస్తున్న స‌మ‌యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఇలాంటి ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో ఉద్యోగుల‌కు షాక్ త‌గిలినట్టు అయింది.

కాగ ఉద్యోగ సంఘాల‌తో ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌మావేశం అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ పీఆర్సీకి సంబంధించిన జీవోల‌ను అన్నింటినీ రద్దు చేసిన త‌ర్వ‌తే.. తాము ప్ర‌భుత్వంతో చ‌ర్చల‌కు వ‌స్తామ‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. కాగ పీఆర్సీని వ్య‌తిరేకిస్తు ఉద్యోగులు స‌మ్మె చేయ‌డానికీ సిద్ధం అయ్యారు. ఇప్ప‌టి కే స‌మ్మె నోటీసును కూడా ఇచ్చారు. వ‌చ్చె నెల 7 వ తేదీ నుంచి ఉద్యోగులు స‌మ్మె చేయ‌నున్నారు. కాగ ఇలాంటి స‌మ‌యంలో ఉద్యోగుల‌కు కొత్త పీఆర్సీ ప్ర‌కార‌మే జీతాలు, పెన్ష‌న్ బిల్లుల‌ను ప్రాసెస్ చేయాల‌ని ట్రెజ‌రీ కి ఆర్ధిక శాఖ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version