అదరహో అనిపిస్తున్న బింబిసార.. బ్లాక్ బస్టర్ పక్కా అంటూ..!!

-

ప్రముఖ హీరో వశిష్టి మల్లిడి దర్శకుడిగా మారి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం బింబిసార. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఆశలకు , అంచనాలకు మించి ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. మరో అఖండ అవుతుందంటూ ప్రేక్షకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో గా ముందుకు నడిపించాడు అని, కళ్యాణ్ రామ్ నటన చాలా అద్భుతంగా ఉంది అని సినిమా చూసిన నందమూరి అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కేథరిన్ తో పాటు సంయుక్తమేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు అలాగే బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ నటించిన తీరు.. ఆయన ముఖంలో ఉట్టిపడే రాజసం అన్నీ కూడా చూపుర్లను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు సినిమా అయిపోయిన తర్వాత కూడా అంత త్వరగా అయిపోయిందా అని ప్రేక్షకులు ఫీల్ అవుతూ ఉండడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ముఖ్యంగా విజువల్స్ , బిజిఎం అన్నీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఫస్ట్ అఫ్ కంటే సెకండ్ హాఫ్ మరింత భీభత్సంగా ఉందని చూసిన ప్రేక్షకులు సమాచారం.

కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాశం ఉంది అని ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందో మనం చెప్పవచ్చు ఇకపోతే కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను ముందుకు నడిపించడంతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని ప్రేక్షకులు తమ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version