ఇటీవల కొందరు ఇన్‌ప్లుయెన్సర్లు చర్యల శృతి మించుతున్నాయి. పబ్లిక్ ప్రదేశాలు, ఆరాధన ప్రదేశాలు అని చూడకుండా పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. వారి చేష్టల వలన తోటి వారు ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే మమతా రాయ్‌పై అనే ఇన్‌ఫ్లుయెర్స్‌పై చేసిన చర్యలకు గాను కాళ బైరవ ఆలయ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారణాసిలోని కాళ భైరవ ఆలయంలో ఇన్‌ఫ్లుయెన్సర్ మమతా రాయ్ తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. గర్బగుడిలో దేవుడి విగ్రహం ఎదురుగా బర్త్ డే కేక్ కట్ చేయడం వివాదస్పదమైంది. అంతేకాకుండా ఆ తతంగాన్ని వీడియో షూట్ చేశారు. దీనిపై భక్తులు, మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మమతా రాయ్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఆమె భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇన్‌ప్లుయెన్సర్ మమతా రాయ్ పై భక్తులు ఆగ్రహం
వారణాసిలోని కాళ భైరవ ఆలయంలో ఇన్‌ఫ్లుయెన్సర్ మమతా రాయ్ బర్త్ డే కేక్ కట్ చేయడం వివాదస్పదమైంది. అంతేకాకుండా దేవుడి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి వీడియో షూట్ చేశారు. దీనిపై భక్తులు, మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మమతా రాయ్‌పై… pic.twitter.com/WYl38eCjnQ
— ChotaNews (@ChotaNewsTelugu) December 2, 2024