నందమూరి కుటుంబానికి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు విడదీయరాని అనుబంధం ఎంతో ఉంది. రాజకీ యంగా, నటన పరంగా ఈ కుటుంబం ఇప్పటికీ ప్రజలతో అవినాభావ సంబంధాన్ని దాదాపు ఐదు దశాబ్దా లుగా కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ నందమూరి కుటుంబంలోకి అల్లుడుగా ఎంట్రీ ఇచ్చిన చంద్రబా బుకు ఈ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? నటన పరంగా నందమూరి వారసులుగా జూనియ ర్ ఎన్టీఆర్ మొదలుకుని బాలయ్య వరకు పలువురు నటులు వచ్చారు. కొన్నిసినిమాలు హిట్టయినా.. కొన్ని ఫెయిలైనా.. వారి హవా మాత్రం కొనసాగుతోంది.
అయితే, రాజకీయంగా చూసుకున్నప్పుడు మాత్రం నారా కుటుంబానికే చెందినప్పటికీ.. చంద్రబాబు మా త్రం నందమూరి ఫ్యామిలీని ప్రజల్లో నిలబెట్టారనడంలో సందేహం లేదు.తొలుత కాంగ్రెస్‌తో రాజకీయా లు ప్రారంభించిన చంద్రబాబు.. తర్వాత కాలంలో అనూహ్యంగా ఎన్టీఆర్ స్తాపించిన టీడీపీలో చేరి మం త్రి అయ్యారు. తర్వాత కాలంలో పార్టీ సంక్షోభానికి గురైన సమయంలో బాబు పార్టీ పగ్గాలు చేపట్టారు. నిజా నికి అప్పట్లో చంద్రబాబు ఇలా పార్టీ పగ్గాలు చేపట్టకపోయి ఉండి ఉంటే.. అనే ప్రశ్న ఎప్పటికీ సశేషమే! పార్టీని నడిపించడం అంటే అంత ఈజీకూడా కాదు.
ఈ విషయంలో నందమూరి ఫ్యామిలీ కన్నా కూడా చంద్రబాబు టీడీపీ అధినేతగా మంచి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆవేశ కావేశాలకు లోను కాకుండా.. ఒకవేళ ఎప్పుడైనా ఆవేశానికి గురైనా.. వాటిని సరిదిద్దుకునిదాదాపు 1996 నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీని నడిపించడం, ఎక్కడా వ్యతిరేకత రాకుండా నందమూరి కుటుంబాన్ని కూడా తనతో కలుపుకొని రాజకీయంగా ముందుకు సాగడం వంటివి చంద్రబాబు దక్షతకు అద్దం పడతాయి. అందుకే ఆదిలో నందమూరి కుటుంబమే టీడీపీకి సారధ్యం వహించి ఉంటే బాగుండేదని అన్న వారు కూడా తర్వాత కాలంలో చంద్రబాబును అంగీకరించారు.
ఇక, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాలేదా అంటే వచ్చారు.వచ్చినా.. నిజానికి తమ సత్తా చాటుకోవడంలో వారు బాబును ఓడించలేక పోయారు. అందుకే సినీ పరంగా నందమూరి కుటుంబం పరిస్థితి ఎలా ఉన్నా.. రాజకీయంగా నందమూరి కుటుంబం ప్రజల మధ్య ఉందంటే.. దానికి చంద్రబాబే కారణమని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే కాదు.. ఎప్పటికీ ఇది నిజం!