పాక్ కి చురక: నీ ఏడుపేదో నువ్వు ఏడూ ఇమ్రాన్!!

-

కులమతాలకు అతీతంగా, సుమారు 130 కోట్లమంది ప్రజలు ఐకమత్యంగా జీవిస్తున్న ప్రజాస్వామ్య దేశం ఈ భూ ప్రపంచం మీద ఏదైనా ఉందంటే అది భారతదేశమే అని ఎవరిని అడిగినా టక్కున చెబుతారు అనడంలో సందేహం లేదు. తనను తాను రక్షించుకుంటూనే… ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు కూడా అత్యవసర మందులు అందించే స్థాయ్యిలో ఈ కరోనా సమయంలో భారత్ నిలిచింది. కరోనా కట్టడి విషయంలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతుంది. ఈ క్రమంలో తన ఏడుపేదో తాను ఏడలేని పాక్… భారత్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అది కూడా… భారత్ లో ఐకమత్యంగా ఉన్న హిందూ – ముస్లింలకు మద్య చిచ్చు పెట్టేలా!!

వివరాళ్లోకి వెళ్తే… మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతుంటే పాకిస్తాన్‌ మాత్రం భారత్‌ ప్రభుత్వంపై అసత్య ఆరోపణచేస్తూ తన మనుగడ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. భారత్ తో శతృత్వమే తమ మనుగడకు ముఖ్యం అని భావించారో ఏమో కానీ… మరోసారి తన వక్ర బుద్ధిని చూపించరు ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. అందుకు ఆయన ఎంచుకున్న మార్తం… భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే సాకుగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని! సిగ్గు వదిలేసిన కబుర్లు కాకపోతే… ఇలాంటి చౌకబారు విమర్శలు ఇమ్రాన్ కి అవసరమా అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.
పాకిస్తాన్‌ లో కరోనా వ్యాప్తిని అరికట్టలేకనే, చేవ లేక చేతకాక భారత​ ప్రభుత్వంపై ఇమ్రాన్‌ దిగాజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలను తిప్పికొట్టింది! పాక్‌ లో కరోనా బారినపడిన వారికి కనీస వైద్య సదుపాయాలు లేవనే విషయం నుంచి ప్రజల దృష్నిటి మరల్చడానికే ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్‌ ఇచ్చింది.

భారత్ లో ముస్లింల గురించి, హిందువుల గురించి, క్రైస్తవుల గురించి ఆలోచించడానికి ఈ దేశంలో బలమైన అధినాయకత్వం ఉంది. ఐకమత్యంగా బ్రతకాలనుకునే 130 కోట్ల జనాబా ఉన్నారు. అన్నామంటే అన్నమంటారు కానీ… ఈ సమయంలో అన్నదమ్ముల్ల కలిసి ఉంటున్న వారిపై పడి ఏడ్చే ముందు… వారి ఏడుపేదో వారు చూసుకుంటూ… కరోనా నియంత్రణ చేసుకుని బుద్దిగా ఉండటం మంచిదని ఈ సందర్భంగా ఇమ్రాన్ కు పలువురు సూచిస్తున్నారు.

కాగా… పాకిస్థాన్ జనాభా పట్టుమని 20కోట్లు కూడా ఉండదు! అలాంటి చోటా దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులు 8వేలకు పైగా ఉండగా.. మరణాల సంఖ్య 176గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version