మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకే బీజేపీ బస్తీ నిద్ర : ఎంపీ చామల

-

మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకే బీజేపీ ఆ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్రకు పిలుపునిచ్చాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.ఈ ఈ క్రమంలోనే శనివారం సాయత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని సుమారు 20 బస్తీల్లో బీజేపీ ముఖ్య నేతలు బస్తీ వాసులతో కలిసి నిద్రించనున్నారు.


సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్‌‌పేట్‌ పరిధిలోని తులసీరామ్‌ నగర్‌లో నిద్రించనున్నారు. దీనిపై ఎంపీ చామల స్పందిస్తూ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు బీజేపీ బస్తీ నిద్రకు పలుపునిచ్చిందని ఆరోపించారు. మూసీ ప్రజల వాస్తవ పరిస్థితులను కమలనాథులు తెలుసుకోవాలని హితవు పలకారు.అక్కడి ప్రజలతో కలిసి నిద్రించి,వారితో భోజనం చేసి యోగక్షేమాలు తెలుసుకుని వస్తే తప్పు లేదని..కానీ ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవద్దని సూచించారు.సబర్మతి, గంగా రివర్ ఫ్రంట్ మాదిరిగానే మూసీ పునరుజ్జీవానికి బీజేపీ నేతలు సహరించాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news