స్ట్రాటజీ మారుస్తున్న కమలం..

-

తెలంగాణలో దూకుడుగా రాజకీయం చేస్తున్న బీజేపీకి ఈ మధ్య కేసీఆర్ కాస్త బ్రేక్ వేసినట్లే కనిపిస్తోంది…ఇప్పటివరకు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు రాజకీయం చేసిన కమలదళం..ఇటీవల కేసీఆర్ దూకుడుతో కాస్త ఆలోచనలో పడింది. అనూహ్యంగా కేసీఆర్..జాతీయ స్థాయిలో బీజేపీని టార్గెట్ చేయడంతో రాజకీయం పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ సడన్ ఎటాక్‌తో బీజేపీ కాస్త నిదానించింది. కేసీఆర్‌పై ఎదురుదాడి చేస్తున్నా సరే…పెద్దగా హైలైట్ కావడం లేదు…కేసీఆర్ చేసే రాజకీయం ముందు బీజీపీ తేలిపోతుంది.

అందుకే బీజేపీకి స్ట్రాటజీ మార్చాల్సిన అవసరం వచ్చింది..ఇలాగే మాత్రం ముందుకెళితే చిక్కుల్లో పడక తప్పదు…అయితే బీజేపీ కూడా ఆ దిశగానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది..ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిస్తితులని వివరించేందుకు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అధిష్టానం పెద్దల సలహాలు తీసుకుని రాష్ట్రంలో ఇంకా దూకుడుగా ముందుకెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది.

ఇక రాష్ట్రానికి వచ్చాక బండి సంజయ్ మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టాలని చూస్తున్నారు..ఇదే క్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని బండి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో బండి…పార్లమెంట్ స్థానాల వారీగా ఉన్న అసెంబ్లీ ఇంచార్జ్‌లతో సమావేశం నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. మొదట నియోజకవర్గాల్లో పార్టీ బలపడితే చాలు అనేది బండి వ్యూహం..క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా పనిచేస్తేనే ప్రయోజనం ఉంటుందనేది బండి వ్యూహం.

అదే సమయంలో కేసీఆర్ చేసే రాజకీయానికి చెక్ పెట్టాలనేది బండి వ్యూహంగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ చేసే రాజకీయం బీజేపీకి కాస్త నెగిటివ్ అవుతుంది..అందుకే కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఆయనకు చెక్ పెట్టాలని బీజేపీ చూస్తుంది. అలా కేసీఆర్‌కు చెక్ పెడితేనే తెలంగాణలో బీజేపీ నిలబడుతుంది…లేదంటే అంతే సంగతులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version