బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై కక్ష సారిస్తోందని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దేశంలో ప్రతిపక్షాలను బెదిరించి, దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఈ దేశ ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని, దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశ విభజనకు కారణం అవుతున్న బీజేపీపై పోరుకు ‘భారత్ జోడో’ యాత్ర చేస్తానని ప్రకటించిన తరువాత, బీజేపీకి దేశంలో నూకలు తీరుతాయనే భయంతోనే బీజేపీ ఈడీని ఉపయోగిస్తోందని విమర్శించారు.
బీజేపీ దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తోంది: భట్టి విక్రమార్క
-