వడోదర టూ ముంబైకి గుండె రవాణా.. పేషంట్ ప్రాణాలు సేఫ్!

-

ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడింది. గుజరాత్‌లోని వడోదర నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి గుండెను సకాలంలో చేర్చి ప్రాణాలు నిలిపింది. వడోదర ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ నుంచి లైవ్ గుండెను ఇండిగో విమానంలో ముంబై గ్లోబర్ ఆస్పత్రికి 2:20 గంటల్లో గుండెను సురక్షితంగా చేర్చింది. ఈ మేరకు వ్యక్తి ప్రాణాలను కాపాడిన సంస్థ సిబ్బందిని ఇండిగో ఎయిర్‌లైన్ సీఈఓ రోనోజోయ్ దత్త అభినందనలు తెలియజేశారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్

ఈ సందర్భంగా సీఈఓ రోనోజోయ్ మాట్లాడుతూ.. సురక్షితమైన లాజిస్టిక్స్ ద్వారా లైవ్ గుండెను సకాలంలో చేరవేసిన గ్లోబల్ హాస్పిటల్స్ బృందానికి మద్దతు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ప్రతి ప్రాణం ఎంతో విలువైందని, ఒకరి ప్రాణాలు రక్షించడానికి ఇండిగో సహకారం అభినందనీయం అన్నారు. వడోదర, ముంబైలోని ఇండిగో సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ముంబై గ్లోబల్ హాస్పిటల్ కూడా ఇండిగో ఎయిర్‌లైన్ అభినందనలు తెలియజేశారు. మూడు గంటలు దాటితే లైవ్ గుండెను మరో వ్యక్తికి అమర్చడం కష్టమని, ఇండిగో సిబ్బంది చేసిన శ్రమ వల్లే ఒకరి ప్రాణం నిలిచిందని వైద్యులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version