తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. విద్యుత్ ఛార్జీలను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. కాగ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కూడా విద్యుత్ ఛార్జీల పెంపు పై పోరు బాట పట్టింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు.. విద్యుత్ ఛార్జీలను పెంచితే.. బషీర్ బాగ్ ను ఉద్యమం ప్రారంభించారు.
అక్కడే ఉద్యమకారులపై చంద్రబాబు కాల్పులు జరిపారు. కాగ అదే బషీర్ బాగ్ నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు పై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాలెట్ బాక్స్ లను ఏర్పాటు చేసి.. విద్యుత్ ఛార్జీల పెంపు పై ప్రజల నుంచి అభిప్రాయాలను కోరనున్నారు.
దీని తర్వాత… రాష్ట్ర ప్రభుత్వంపై సమర భేరీ మోగించాలని బీజేపీ నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.