8 సంవత్సరాల నుంచి బిజెపి తెలంగాణకు అన్యాయం చేస్తోంది – హరీష్ రావు

-

కృష్ణా బేసిన్ లో తెలంగాణ నీటి వాటాలపై 11 నెలలు అవుతున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి హరీష్ రావు. దీనివల్ల 500 పైచిలుకు టీఎంసీల నీరు తెలంగాణ వాడుకోలేకపోతుందని తెలిపారు. 8 సంవత్సరాల నుంచి కేంద్రంలోని బీజేపీ తెలంగాణ కు తీరని అన్యాయం చేస్తోందన్నారు. 9,10 షెడ్యూల్ లోని అంశాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఏపీ విద్యుత్ సంస్థలు తెలంగాణకు17828 కోట్లు ఇవ్వాల్సి ఉందని.. నాడు ఎస్పీడిసిఎల్ కింద తీసుకున్న అప్పు ఇతర అంశాలపై ఖర్చు అయ్యిందన్నారు. కేంద్రం కక్ష్య సాధింపు ధోరణిలో ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు ఇవ్వాల్సిన సీఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఏపీకి ఇచ్చారని.. వాటిని తెలంగాణకు ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి ఆస్తుల మెయిన్టనెన్స్ కోసం తెలంగాణకు 405 కోట్లు రావాల్సి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version