బిజెపి రాజకీయ పార్టీ కాదు.. రాబందుల పార్టీ – ఎమ్మెల్యే బాజిరెడ్డి

-

బీజేపీ రాజకీయ పార్టీ కాదు.. రాబంధుల పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. అన్ని రాష్ట్రాలు అయ్యాయి ఇప్పుడు తెలంగాణ పై బీజేపీ కన్ను పడిందని మంటిపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలు చేపట్టిందని.. ఆనాడు కాంగ్రెస్ చేపట్టిన చర్యల వల్ల ఇప్పుడు పుట్టగతులు లేకుండా పోయిందని అన్నారు. భవిష్యత్ లో మోడీ, అమిత్ షా అరాచకాలకు ప్రజల నుంచి శిక్ష తప్పదని అన్నారు గోవర్ధన్ రెడ్డి.

లిక్కర్ స్కాంలో కవిత పేరును నిరాధారమైన ఆరోపణలు బీజేపీ చేస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు అమిత్ షా బూట్లు కాళ్లకు వేసిన వ్యక్తులు ఈ రాష్ట్ర బిజెపి నాయకులని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేయడం తప్ప ప్రజలకు ఎం చేస్తుందో పాలసీ చెప్పడం లేదన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే ఈడీ, ఐటి, బీజేపీ కండువా కప్పుకుంటే మాత్రం ఏ కేసులు ఉండవన్నారు. కవిత ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version