సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తామని బెదిరింపులు..బిజెపి నేత అరెస్ట్

-

ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజీందర్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తానని వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చి 31 తేదీన జరిగిన నిరసన ప్రదర్శనలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఆప్ నేతలు పోలీసులకు అందజేశారు.

దీంతో తజిందర్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బగ్గాను అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్కాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే సీఎం కేజ్రీవాల్ అరెస్టులు చేస్తున్నారంటూ ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి కపిల్ మిశ్రా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version