జగన్ సర్కార్.. సలహాదారుల ప్రభుత్వం అని బీజేపీ నేత బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు.. కర్నూల్ లోని శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. సలహా దారుల మాటలు విని జగన్ .. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినట్టే.. జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఒక వాత పెడితే.. జగన్ రెండు వాతలు పెడుతున్నారని విమర్శించారు.
కొత్త జిల్లాలు అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయమే.. ఇప్పుడు జగన్ తీసుకున్నారని అన్నారు. అంతే కాకుండా.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పాటిస్తున్నారని అన్నారు. కాగ ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. కాగ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటులో చాలా లోపలు ఉన్నాయని అన్నారు. వాటిని సరిదిద్దాలని డిమాండ్ చేశారు.