ఇప్పుడు న్యూస్ ఛానల్లలో మగవారికంటే ఆడవారే ఎక్కుమంది న్యూస్ ప్రెజంటర్స్ గా ఉంటున్నారు. ఆకట్టుకునే రూపం, మంచి కంఠస్వరం, సమాజం పై విషయ పరిజ్ఞానం..ఒక న్యూస్ రీడర్ కు కావాల్సిన లక్షణాలు. ఇవి ఉంటే చాలు.. జాబ్ కొట్టేయొచ్చు. అబ్బాయిలతో పోలిస్తే న్యూస్ ప్రజెంటర్స్ జాబ్ లో అమ్మాయిలదే హవా..ఇప్పుడు ఇలా ఉంది కానీ..ఒకప్పుడు ఆడవారు ఇంట్లోంచి బయటకు రావడానికే వందసార్లు ఆలోచించేవాళ్లు.. అలాంటిది టీవీ ముందు కుర్చోని వార్తలు చదవడం అంటే వారి తరమేనా అనుకునే రోజులవి. అలాంటిది.. భారతీయ టీవి చరిత్రలోనే మొదటిసారిగా వార్తలు చదివింది ఒక స్త్రీ కావడం ఎంత గొప్పవిషయం.. మరి అలాంటి రోజుల్లో కూడా ధైర్యంగా కెమేరా ముందు కుర్చోని వార్తలు చదివిన తొలి మహిళా న్యూస్ రీడర్ ఎవరో తెలుసా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ మంత్ సందర్భంగా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే కదా..
అలా దేశంలోనే మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా ప్రారంభమైన ప్రతిమ వార్తల ప్రస్థానం..1967 వరకు నిర్విరామంగా కొనసాగింది. ఆరోజుల్లో టీవీ ఉన్న కుటుంబాలను వేళ్లమీద లెక్కేయొచ్చు. 1972 వరకూ దిల్లీలో తప్ప భారతదేశంలో మరెక్కడా టీవీలు లేవు. అయితేనేం నెహ్రూ వంటి ప్రముఖులు ఆమె న్యూస్ బులెటిన్‌ని క్రమం తప్పకుండా చూసేవారు. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో కాలుమోపిన యూరీ గగారిన్‌ను ఆమె ఇంటర్వ్యూ చేయడం దూరదర్శన్ చరిత్రలో ఓ చెరగని ముద్ర. అంతేకాదు.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల్ని సైతం ఆమె ఇంటర్వ్యూ చేశారు.
ఈరోజు జర్నలిజం చేసే ప్రతి మహిళ ఈమే స్టోరీని తప్పక తెలుసుకోవాలి. ఎదుటివారి తప్పును ధైర్యంగా గొంతెత్తి చెప్తున్న ప్రతి న్యూస్ ప్రజెంటర్ కు ప్రతిమ ఒక ఆదర్శం.
-Triveni Buskarowthu