దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ దే: బీజేపీ నేత లక్ష్మణ్

-

తెలంగాణాలో అధికార పార్టీ BRS కు మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లకు మధ్యన విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళు.. వాళ్ళ ప్రభుత్వం గురించి మాట్లాడడం షరా మామూలే. కాగా తాజాగా బీజేపీ నేత కె లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవిధంగా మారిందన్నది వివరించారు. ఈయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రంలో పాలన చాలా అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూనే.. ఈ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవినీతిలో మొదటి స్థానానికి చేరుకుందని ఆరోపణలు చేశాడు. ఈ రాష్ట్రము అవినీతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కేసీఆర్ అవినీతి చేస్తుండడం మూలంగానే ప్రధానిని కలవడానికి ముఖం చెల్లట్లేదు అంటూ కామెంట్ చేశాడు.

ఇక రాష్ట్రంలో దళిత బంధు పథకంలో అర్హులు కావాలంటే BRS ఎమ్మెల్యే లకు ముడుపులు ఇవ్వాల్సిందే అంటూ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ అవినీతిని ప్రజలు తట్టుకోలేకనే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version