తమిళ్ లో స్టార్ హీరోగా ప్రేక్షకుల మదిలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో అజిత్.. అప్పుడప్పుడు వివాదాలలో చిక్కుకు పోవడం అలవాటుగా మారిపోయింది. తాజాగా అజిత్ పై ఒక తమిళ నిర్మాత మోసగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తమిళ సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నిర్మాత మాణిక్కం నారాయణన్ మాట్లాడుతూ హీరో అజిత్ కుమార్ తనకు మంచివాడినంటూ ఫీల్ అవుతాడని, వాస్తవానికి అజిత్ మోసగాడు అని షాక్ ఇచ్చారు. ఈయన పూర్తి వివరాలను తెలుపుతూ కొంతకాలం క్రితం, అజిత్ తన తల్లితండ్రులను మలేషియా పంపడానికి నా దగ్గర కొంచెం డబ్బులు తీసుకున్నాడని తెలిపారు, అయితే ఈ డబ్బుకు బదులుగా ఫ్యూచర్ లో మా సంస్థలో సినిమా చేస్తానని…లేదా నేను తీసుకునే రెమ్యూనరేషన్ లో అయినా ఇచ్చేస్తానని చెప్పారు.