బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌లోకి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే..

-

బీజేపీకి షాక్‌ తగిలింది. జడ్చర్చ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మరాఠి చంద్రశేఖర్‌ నేడు టీపీసీసీ రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరారు. గురువారం గాంధీ భ‌వ‌న్‌కు వ‌చ్చిన చంద్రశేఖ‌ర్‌ను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి సాద‌రంగా ఆహ్వానించారు. చంద్రశేఖ‌ర్‌తో పాటు దేవ‌ర‌కొండ‌కు చెందిన మ‌రో కీల‌క నేత బీల్యా నాయ‌క్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన మరాఠి చంద్రశేఖ‌ర్‌ అలియాస్‌ ఎర్ర శేఖ‌ర్‌, 1996, 1999 ఎన్నిక‌ల్లో జ‌డ్చ‌ర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌ర్వాత 2009 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థిగానే జ‌డ్చ‌ర్ల నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ‌లో టీడీపీ ప్రభావం త‌గ్గిపోయిన నేప‌థ్యంలో చాలా కాలం పాటు రాజ‌కీయాల‌కు దూరంగానే ఉన్న ఎర్ర శేఖ‌ర్ కొద్దికాలం క్రితం బీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు ఆయ‌న బీజేపీకి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రేవంత్‌తో ఎర్ర శేఖ‌ర్‌కు ఒకింత స‌న్నిహిత‌త్వ‌మే ఉంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌లోకి ఎర్ర శేఖ‌ర్‌కు ఎంట్రీ ఈజీగానే దొరికింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version