పీసీసీ చీఫ్ ఈ దాడికి బాధ్యత వహించాలి : మహేశ్వర్ రెడ్డి

-

బీజేపీ కార్యాలయంపై పెద్ద దాడిని ఖండిస్తున్నాను అని బీజేపీ శాసన సభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే ఈరోజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం పై కాంగ్రెస్ యూత్ నాయకులు ప్రియాంక గాంధీపై చేసిన కామెంట్స్ కు నిరసనగా దాడి చేసారు. కాకపోతే బీజేపీ కార్యాలయం పై కాంగ్రెస్ దుండగులను పంపించి దాడులు చేశారు అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల తలలు పగలగోట్టారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా.. సీఎం ఏం చెప్పాలని అనుకుంటున్నారు.. ఏమిటి ఈ సంస్కృతి అని ప్రశ్నించారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ దీనికి బాధ్యత వహించాలి. మహేష్ కుమార్ గౌడ్ వి చిల్లర చేష్టలు. ఈ దాడికి బాధ్యత వహించి మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలి. హోం మంత్రి సీఎం చేతుల్లో ఉంది.. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారా అని అన్నారు. అలాగే కేటీఆర్ అధికారుల ప్రవేయం ఉందని అంటున్నారు. అధికారులను కేటీఆర్ బెదిరించారు . కేటీఆర్ నిర్దోషి ఐతే నిలబడి ఎదుర్కోవాలి. వాస్తవాలను బయటపెట్టాలి. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయి అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news