తెలంగాణలో తాలిబన్‌ మద్దతు దారులున్నారు : బీజేపీ నేత సంచలనం

-

తెలంగాణ నాయకులు తాలిబాన్లకు మద్దతు దారులుగా ఉన్నారని…. ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ వారితో కుడి, ఎడమ భుజంగా రాజకీయాలు చేస్తుందని బీజేపీ నేత మురళి ధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో బీజేపీ పాలు పంచుకుందని… తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో కేంద్రం సహకారం ఉందన్నారు. గత ఏడు సంవత్సరాలు గా తెలంగాణ ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదని… ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు.

ఉద్యమాల మీద లాఠీ దెబ్బలు పెరిగాయని.. అధికార పార్టీ అంతర్గత ప్రజా స్వామ్యాన్ని కుటుంబం దగ్గర కుదువ పెట్ట బడిందన్నారు.  యువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని… ఓయూ లాంటి వర్సిటీల్లో 80 శాతం ఫ్యాకల్టీ పోస్ట్ లు ఖాళీ గా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా టైమ్ కి రావడం లేదని.. డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయం లో డప్పు, డబ్బా కొట్టుకోవడం తప్ప చేసింది ఏమి లేదని చురకలు అంటించారు. అవినీతి కి పర్యాయ పదం తెలంగాణ ప్రభుత్వమని.. ఈ ప్రభుత్వాన్ని బెదిరించినా, ప్రశ్నించినా మార్పు రాదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించడమే పరిష్కారమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version