సోషల్ మీడియా విషయంలో కేంద్రం తప్పే ఏంటీ…?

-

సోషల్ మీడియా నిబంధనల విషయంలో బిజెపి నేత విజయశాంతి సంతృప్తి వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో ఎవరెవరో, ఏవేవో పోస్టులు పెట్టడం.. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం అని ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి, దోషులను శిక్షించడం.. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు భంగం వాటిల్లకుండా చూడటానికే.. సోషల్ మీడియా కంపెనీలకు కొత్త నిబంధనలు పెట్టడం జరిగిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంగా చెప్పారు అని ఆమె తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మన దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించడం, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగల్చడం, అత్యాచారాలు వంటి పలు రకాల నేరాలను ప్రేరేపించే ఏవైనా సందేశాలు సోషల్ మీడియాలో పోస్ట్ అయినపుడు, వాటిని ముందుగా పోస్ట్ చేసినవారి వివరాలు చెప్పాలని, శాంతిభద్రతలను దెబ్బతీసే పోస్ట్‌ల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని కొత్త డిజిటల్ రూల్స్‌లో ఉందని మంత్రి విపులంగా చెప్పారని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version