తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

-

సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభమైంది అని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. హైదరాబాద్ ఎం జి బి ఎస్ లో వ్యాక్సినేషన్ పక్రియ ను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. 18 సంవత్సరాల పైబడిన వారందరికీ మొదటి డోస్ ను ఈ వ్యాక్సినేషన్ లో ఇవ్వనున్నారు. రానున్న మూడు రోజుల్లో 50 వేల మంది ఆర్టీసీ లో పని చేస్తున్న వారందరికీ వాక్సినేషన్ పూర్తి చేయాలని టార్గెట్లు పెట్టుకున్నాం అని అధికారులు తెలిపారు.

జిల్లాలో ఆర్టీసీ సిబ్బంది వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసామని ఎంజిబిఎస్ పరిధిలో ఉన్న ఐదు డిపోల వారికి ఎంజిబిఎస్ బస్ స్టాండ్ లో వాక్సినేషన్ ప్రారంభించారు అని వివరించారు. ప్రతి ఉద్యోగి వాక్సిన్ ను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version