వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అలజడి మొదలయ్యింది. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆస్తులను ప్రవేటీకరణ చేయడానికి నడుం బిగించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. కానీ అమ్మడానికి వీలు లేదని చాలా కాలంగా నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. కాగా తాజాగా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం బిడ్ లను ఆహ్వానిస్తున్నట్లు.. ఆ బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో తెలుగు రాష్ట్రాలలో రచ్చ రచ్చగా ఉంది. ఈ న్యూస్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కేసీఆర్ నుండి అధికారిక ప్రకటన వచ్చాకే స్పందిస్తానని చెప్పాడు.
కేసీఆర్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ ..!
-