ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీని గెలవని జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం చరిత్రలో నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 16 లో భాగంగా రెండు మ్యాచ్ ల తర్వాత ఒకటి గెలిచి మరొకటి ఓడిపోయి తటస్థ స్థితిలో ఉంది. ఆర్సీబీ బలం అంతా తమ జట్టు ఓపెనర్లు డుప్లెసిస్ మరియు విరాట్ కోహ్లీ ల మీదనే ఉంది. వీరికి కనుక విఫలం అయితే టీం అంతా పేకమేడలా కూలిపోతోంది. ఇందుకు గత మ్యాచ్ ఉదాహరణ. కాగా ఈ రోజు మ్యాచ్ లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో దుర్బేధ్యంగా ఉన్న లక్నో సూపర్ జయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియమ్ బెంగుళూరు లో జరగనుంది.
ఐపీఎల్ 2023 : ఆర్సీబీ లక్నో “జంబో ప్లేయర్” ను అడ్డుకుంటుందా !
-