హోటల్ లో టీఆర్ఎస్ ఎంపీలను కలిసింది ఎవరు…?

-

తెలంగాణా విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటీ…? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. నాలుగు ఎంపీ స్థానాలను తెలంగాణాలో గెలిచిన బిజెపి ఆ తర్వాత కొందరు మాజీ ఎంపీలను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేసింది అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. కాని కెసిఆర్ ముందు నుంచి కూడా వాటిని పసిగడుతూ రాష్ట్రంలో బిజెపిని ఎక్కడా కూడా అడుగు పెట్టనీయలేదు అనేది వాస్తవం. రాజకీయంగా ఇబ్బందులు రాకుండానే కెసిఆర్ చూసుకున్నారు.

అయితే ఎన్నార్సి, క్యాబ్ విషయంలో బిజెపికి మద్దతు ఇవ్వకపోవడం, తమకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను తెరాస ఏకం చేస్తుందనే ప్రచారం బిజెపికి ఆగ్రహం తెప్పించింది. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశాలు హైదరాబాద్ లో జరిగాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆ సమావేశాలు రాష్ట్రంలో జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న కొందరు బిజెపి నేతలు ఇద్దరు తెరాస ఎంపీలతో చర్చలు జరిపినట్టు సమాచారం. హైదరాబాద్ లో ఒక హోటల్ లో ఇద్దరు ఎంపీలను,బిజెపి నేతలు, ఒక కేంద్ర మంత్రి కలిసారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే ఇది ముందే కెసిఆర్ పసిగట్టారని సమాచారం.

అది పసిగట్టి ఆ ఎంపీలను ముందే కెసిఆర్ సిద్దం చేసారట. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలను కూడా బిజెపి నేతలు కలిసినట్టు సమాచార౦. ఇక అక్కడి నుంచి కెసిఆర్ ఎమ్మెల్యేల అందరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలుసుకుంటూ బిజెపి ఆటలు సాగనీయడం లేదట. అయితే అమిత్ షా నేతృత్వంలోనే ఇదంతా జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version