దుబ్బాక బైపోల్.. బూత్ ల వారి లెక్క తీస్తున్న బీజేపీ…!

-

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయ్‌ పార్టీలు, బూత్‌ల వారీగా గెలుపు ఓటములపై అంచనాలు వేసుకుంటున్నాయ్‌. పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయ్‌ మరి విజయం ఎవరిని వరించబోతుందన్నది ఇప్పుడు ప్రధాన పార్టీలను టెన్షన్ పెట్టిస్తుంది.

దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న రానున్నాయి,ఓటింగ్ సరళి పై బీజేపీ నేతలు మండలాల వారీగా సమావేశమవుతున్నారు. ఏ మండలం లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు.తమకు కలిసి వచ్చిన అంశాలను బేరీజు వేసుకుంటున్నారు, ప్రతి పోలింగ్ బూత్ వారీగా ఫీడ్ బాక్ తెప్పించుకుంటున్నారు.ఎవరికి వారు తమది గెలుపు అంటే తమది గెలుపు అని ప్రచారం చేసుకుంటున్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే దుబ్బాకలో పోలింగ్ శాతం తగ్గింది.అయితే అధికారపార్టీ మీద వ్యతిరేకత వల్లే పోలింగ్‌ తగ్గిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయ్‌. కాని సంక్షేమ పథకాలు,అభివృద్ధి తమను గెలిపిస్తాయని ధీమాలో ఉంది సర్కార్‌.ఫలితం డిసైడ్ లో ప్రతీ ఓటు కీలకం కాబట్టి వాళ్ళు ఎటు వైపు మొగ్గు చూపారన్నది కూడా లెక్కలు వేసుకుంటున్నారు.కొత్త గా వచ్చిన యువత ఓట్లు తమకు ప్లస్ అవుతుందని భావిస్తోంది బీజేపీ. బీడీ కార్మికులు , చేనేత కార్మికులు ఓట్లు, రైతులు, పింఛన్లు ఓట్లు గంప గుర్తుగా తమకే పడతాయనే ధీమాలో ఉంది సర్కార్‌. సామాజిక వర్గాలు , సమీకరణాలు వారీగా బేరీజు వేసుకుంటున్నాయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version