బీజేపీ ఎంపీ: TSPSC పేపర్ లీక్ 5 లక్షల మంది భవిష్యత్తుపై ప్రభావం ..

-

తాజాగా తెలంగాణాలో జరిగిన TSPSC పేపర్ లీక్ వ్యవహారం ఎంతటి దుమారాన్ని రేపుతూ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొందరి స్వార్ధం కోసం ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని చెప్పాలి. పేపర్ లీకేజ్ తో ఈ పరీక్షపై ఆధారపడిన 5 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు అయోమయంలో పడిందని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ పేపర్ లీక్ కు సంబంధించి TSPSC చైర్మన్ ను విచారించకపోవటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది అని చెప్పారు.

ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో పూర్తి బాధ్యత విచారణ చేస్తున్న అధికారులదేనని… సరిగా విచారణ చేసి ఈ విషయంలో వారికి శిక్ష పడేలా చేయాలని ఎంపీ అరవింద్ అడుగుతున్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించడానికి చూస్తున్నానని.. కానీ కొన్ని కారణాల వలన కాంగ్రెస్ ఎంపీల వలన వీలవడం లేదని తెలిపారు. మరి ఈ పేపర్ లీకేజ్ విషయం ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version