దేశంలో వరస విజయాలతో బీజేపీ దూసుకు పోతుంది. వరసగా కాంగ్రెస్ ఓటమి చవి చూస్తుంది.. ఓటమి లో రికార్డు సృష్టిస్తుంది. రాహుల్ గాంధీ కుటుంబం మీద రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రేమ కురిపిస్తున్నారు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. హామీలు అమలు చేయలేక అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అభాసు పాలు అయ్యారు. మంత్రులు ఒకరి పై ఒకరు పొట్లాడుకుంటున్నారు.
ఇక BRS ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ అరువు తెచ్చుకొని డబ్బుల మూటలతో బరిలోకి దించింది. కాంగ్రెస్ కు అడుకట్ట వేయకపోతే తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. గెలిస్తే రేవంత్ రెడ్డి తన అబద్ధపు మాటలకు ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటాడు. కాబట్టి తెలంగాణ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది.. ఆలోచించి ఓటు వేయండి. ఉద్యోగ ఉపాధ్యాయులది త్యాగాల చరిత్ర.. కానీ ఉద్యమాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.