బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగికి గాయాలు కావడంపై…కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఎంపీలు మమ్మల్ని అడ్డుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు రాహుల్ గాంధీ. దీంతో బీజేపీ ఎంపీలు అడ్డుకున్నప్పుడు ఈ తోపులాట జరిగిందని వెల్లడించారు. పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు మాకు ఉందని తెలిపారు రాహుల్ గాంధీ. ఈ సంఘటన జరుగడం దురదృష్టం అని తెలిపారు.
ఇక అటు బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగికి గాయాలు అయ్యాయి.. రాహుల్ ఒక ఎంపీని తోసేయడంతో, ఆయన తనపై పడటంతో గాయపడ్డానని ప్రతాప్ సారంగి వెల్లడించారు. ప్రతాప్ సారంగిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. కాంగ్రెస్ ఎంపీలు గూండాగిరి చేస్తున్నారని బీజేపీ ఎంపీలు ఆరోపణ చేస్తున్నారు. అయితే… బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగికి గాయాలు కావడం తో.. అమిత్ షా – అంబేద్కర్ ఇష్యూ డైవర్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
అవును ఎంపీని నేనే తోశాను – రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ తోయడం వల్లే తాను
గాయపడినట్టు బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర చేసిన ఆరోపణలపై స్పందించిన రాహుల్ గాంధీపార్లమెంట్ లోపలికి వెళ్తున్న నన్ను బీజేపీ ఎంపీలు ఆపడానికి ప్రయత్నించారు, నాపై బెదిరింపులకు దిగారు.. ఈ క్రమంలో ఇలా జరిగింది.… https://t.co/XTXnsclMra pic.twitter.com/t4vITWXV5z
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2024