ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కొన్ని అంశాలలో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ బాగా ఇబ్బంది పడుతుందనే విషయం అర్థమవుతుంది. ప్రధానంగా జనసేన పార్టీ నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన బీజేపీ నేతలు కూడా సమన్వయం చేసుకోవడం లేదు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ నేతలు ఆ ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ వల్ల చాలా ఉపయోగం ఉంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గురించి కూడా కాస్తో కూస్తో చర్చలు జరిగాయి. జనసేన పార్టీ తమతో లేకపోతే బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకునే పార్టీ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అందుకే ఇప్పుడు చాలా వరకు కూడా బీజేపీ నేతలు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
అయితే బిజెపి నేతలు ఈ మధ్యకాలంలో తప్పులు ఎక్కువగా చేయడంతో జనసేన నేతలు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర నాయకత్వంపై నాయకత్వం సీరియస్ గా ఉందని తెలుస్తుంది. జనసేన పార్టీ నేతలు ఢిల్లీ పిలిచి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. పవన్ కళ్యాణ్ మినహాయించి మిగిలిన జనసేన పార్టీ నేతలను ఢిల్లీ పిలిచి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలి అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.