కరోనా టీకా విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం

-

దేశంలో కరోనా మరోమారు విజృంభిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమమత్తమయింది. అటు కరోనాను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటూనే ఇటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేయాలని నిర్ణయించడంతో పాటు ఆ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తోంది.

ఇందులో భాగంగా కరోనా టీకాను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి పని చేసే ప్రదేశాల్లోనే వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించింది. అటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ఇటు ప్రైవేటు కార్యాలయాల్లో కూడా టీకా పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. కనీసం 100 మంది వ్యక్తులు టీకా వేయించుకొనేందుకు సిద్ధంగా ఉంటే అక్కడే వ్యాక్సినేషన్‌ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలానే దీని కోసం తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇక అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కేంద్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతోంది. దీంతో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో.. సగం వరకు మహారాష్ట్రలో నమోదవడం గమనార్హం. ఇక మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత కూడా ఏర్పడడం మరింత కలవరపెడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version