బిజెపి పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు..!!

-

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అదే విధంగా దేశంలో కేంద్రంలో భారీ మెజార్టీ పార్టీగా దేశంలో ఉన్న రాష్ట్రాలలో సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీగా చరిత్ర సృష్టించిన భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గత కొంత కాలం నుండి ఉన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో ఒకపక్క జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూనే మరో పక్క కేంద్ర హోంశాఖ మంత్రిగా రాణిస్తున్నారు అమిత్ షా. ఇటువంటి తరుణంలో ఇటీవల పార్లమెంటులో కొన్ని కీలక బిల్లులు తీసుకు రావడంతో దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారటంతో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా కి పార్టీ కార్యక్రమాలు మరోపక్క పరిపాలన విషయాలు ఒత్తిడి ఎక్కువ అవటంతో బిజెపి పార్టీ పెద్దలు బిజెపి పార్టీకి కొత్త అధ్యక్షుడిగా బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న బిజెపి జేపీ నడ్డా ని తాజాగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్ కి చేరుకుని జాతీయస్థాయిలో రాణిస్తున్న బీజేపీ నేతలతో సమావేశమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version