నేడు ఏపీ అసెంబ్లీలో న‌వ్వులు పూయించిన‌ సరదా సన్నివేశాలు..

-

నేడు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు వాడివేడిగా సాగ‌డ‌మే కాక‌.. కొన్ని సంద‌ర్భాల్లో న‌వ్వులు కూడా వెలువెత్తాయి. ఆ రోజు సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. అయితే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాగానే సభలోకి వచ్చిన అధికార వైసీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు గుడ్ మార్నింగ్ చెప్పగా.. టీడీపీ సభ్యులు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సభాపతి అన్న గౌరవం కూడా లేకుండా బ్యాడ్ మార్నింగ్ చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగం సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జాబితా చదువుతూ వివరాలన్నీ చదవాలంటే చాలా సమయం పడుతుంది, నీళ్లు తాగుతా అంటారు.

దానికి స్పీకర్ తమ్మినేని … ‘మీరు తాగితే తాగండి కానీ మాతో నీళ్లు తాగించకండి’ అన్నారు. దీంతో సభలు నవ్వులు వినిపించాయి. ఇక ఆర్ధిక మంత్రి బుగ్గన అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వివరాలు వెల్లడిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేరు ప్రస్తావించారు. ఆయన బినామీలు రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూములు కొన్నారని బుగ్గన చెప్పారు. దీంతో సీట్లో నుంచి లేచి ఆగ్రహం వ్యక్తం చేసిన బుచ్చయ్య చౌదరి.. ఆరోపణలు నిరూపించాలని తొడగొట్టి మ‌రీ సవాల్ విసిరారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఆయన స్పీకర్ పోడియంలోకి వెళ్లి ఆయనకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version