కారుకు పంచర్లు.. బండికి బ్రేకులు..!

-

విశాల భారతదేశంలో ఎవరికి ఎక్కడకైనా వెళ్ళే హక్కు ఉంది…నిషేధిత ప్రాంతాలకు తప్ప ఎవరకైనా స్వేచ్చగా తిరగడం ప్రాథమిక హక్కు. ఆ హక్కులని అధికార పార్టీలు కాలరాస్తున్నాయనే చెప్పాలి. ప్రత్యర్ధి పార్టీలని ఎక్కడక్కడ అణిచి వేయాలనే చూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలని ఎక్కడకు తిరగనివ్వకుండా అధికార పక్షాలు అడ్డుకుంటున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయడం ఎవరు హర్షించరు.

తాజాగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రని అడ్డుకోవడం కూడా కరెక్ట్ కాదనే వాదన ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ వర్గాలు వ్యక్త పరుస్తున్నాయి. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తల పై దాడి చేయడాన్ని, కేసులు నమోదు చేయడాన్ని బండి తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో బండి ధర్మ దీక్షకు దిగారు. అయితే బండిని అడ్డుకుని, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పాదయాత్ర నిలిపివేయాలని నోటీసులు జారీ చేసిన వరంగల్ పోలీసులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, పరిధి దాటి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అయితే ఇలా బండిని అరెస్ట్ చేయడం, పాదయాత్రని అడ్డుకోవడంపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది…కేసీఆర్‌కు భయం పుట్టి ఇలా చేస్తున్నారని జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫైర్ అయ్యారు. ఏదేమైనా పాదయాత్రని అడ్డుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదనే వాదన పోలిటికల్ వర్గాల్లో వస్తుంది. బండికి బ్రేకులు వేస్తే…ప్రజలు కారుకు పంక్చర్లు వేస్తారని బీజేపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఇలాంటి చర్యలకు దిగితే…బీజేపీకే ఇంకా బెనిఫిట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version