జోడో యాత్రపై బీజేపీ సెటైర్.. రాహుల్ విలాసవంతమైన యాత్ర చేస్తున్నారని ట్వీట్

-

రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. రాహుల్ చేస్తోంది పాదయాత్ర కాదని విలాసవంతమైన విహారయాత్ర అని విమర్శలు గుప్పిస్తోంది. ఈ పాదయాత్రలో రాహుల్ ధరించిన ఓ టీ షర్ట్ ను పోస్ట్ చేస్తూ బీజేపీ ఓ సెటైరికల్ ట్వీట్ చేసింది.  ఆ టీషర్ట్​ ధర ఏకంగా రూ.41,257 అంటూ కాంగ్రెస్​పై బీజేపీ విమర్శలు గుప్పించింది. రాహుల్​ ఫొటో, పక్కనే ద బర్​బరీ టీషర్ట్​ ధరతో ఉన్న ఫొటోను ట్విటర్​లో పోస్ట్ చేసింది. ‘భారత్​, దేఖో(భారత్​, చూడు)’ అనే క్యాప్షన్​తో ఈ ఫొటోలు షేర్ చేసి, కాంగ్రెస్​ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేసింది.

బీజేపీ ట్వీట్​పై కాంగ్రెస్​ తీవ్ర స్థాయిలో మండిపడింది. “భారత్​ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి భయం వేసిందా? అసలు విషయాలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడు. దుస్తుల గురించే మాట్లాడదాం అంటే.. మోదీ వేసుకున్న రూ.10లక్షల సూట్, పెట్టుకున్న రూ.1.5లక్షల కళ్లద్దాల గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది” అని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version