కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్ షా కు వివరించారు నేతలు. హోం మినిస్ట్రీ హైపర్ కమిటీని తక్షణమే తెలంగాణకు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. త్వరలోనే హైపవర్ కమిటీ రాష్ట్రానికి రానుంది. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది హైపవర్ కమిటీ.
అయితే వర్షాలు, వరదలతో తెలంగాణా జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాల నీటి మాయమయ్యాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణాలోని గ్రామాలు, పట్టణాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్టుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తాగు సాగునీరు అందే పరిస్థితి నుంచి అందుకు విరుద్ధంగా ఉత్తర తెలంగాణలోని ప్రతి నేలా వరద పరవళ్ళతో పొంగుతూ ఉండడంతోపాటు ఎగువ నుంచి గోదావరికి వస్తున్న వరద తోడుకావడంతో ఊళ్లు, భూములు, దేవాలయాలు, ప్రాజెక్టులు సర్వం నీటిలో తేలియాడుతూ ఉన్నాయి.