ఖమ్మంలో కమలం అడుగు…!

-

తెలంగాణలో బీజేపీ బలం నిదానంగా విస్తరించుకుంటుంది…2019 పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు…ఏదో గ్రేటర్ హైదరాబాద్ వరకే పరిమితమైన బీజేపీ బలం…ఆ తర్వాత నుంచి ప్రతి జిల్లాలో పెరుగుతూ వస్తుంది. గ్రేటర్ లో కూడా కొంతవరకే బీజేపీ బలం ఉండేది…కానీ నిదానంగా అక్కడ బలం పెంచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది..అలాగే దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి…ఎక్కువ డివిజన్లు గెలుచుకుంది. నెక్స్ట్ హుజూరాబాద్ లో సత్తా చాటింది.

ఇలా నిదానంగా బీజేపీ…తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది…ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో రాష్ట్రంలో దాదాపు అన్నీ జిల్లాల్లో బీజేపీ బలం పెరిగిందని తెలిసింది…కానీ ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మాత్రం బీజేపీకి బలం లేదని వెల్లడైంది. దీంతో ఆ జిల్లాల్లో కూడా బలం పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నాయకుడుని లాగి నల్గొండలో బలం పెంచుకోవడం మొదలుపెట్టింది. అటు వరంగల్ లో కూడా ఆపరేషన్ ఆకర్ష్ తో దూసుకుపోతుంది.

కానీ ఖమ్మంలోనే బీజేపీ ఇంకా ఎంటర్ కాలేదు…అక్కడ బీజేపీకి బలమైన నాయకులు లేరు. అయితే ఇప్పుడు అక్కడ కూడా బలం పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. బలమైన నాయకులని లాగే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

అయితే వీరిలో ఎవరు పార్టీలోకి వస్తారనేది క్లారిటీ లేదు…అదే సమయంలో టీఆర్ఎస్ లో ఇంకా అసంతృప్తిగా ఉన్న నాయకులని లాగాలని ట్రై చేస్తుంది. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ..అందుకే ఆ పార్టీపై కూడా కమలం ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఆ పార్టీలో ఉన్న బలమైన నాయకులని బీజేపీలోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఖమ్మంలో కమలంలో పార్టీలోకి వచ్చే నేతలు ఎవరో?

Read more RELATED
Recommended to you

Exit mobile version