BREAKING : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ అయ్యారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ అయ్యారు. బాసర ట్రిపుల్‌ ఐటీ కాలేజీకు వెళుతుండగా.. బండి సంజయ్‌ కుమార్‌ ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. బిక్కనూర్‌ ప్రాంతంలో అరెస్ట్‌ చేసి.. కామారెడ్డికి బండి సంజయ్‌ ని తరలించారు పోలీసులు.

ఇది ఇలా ఉండగా.. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల కష్టాలు తెలుసుకునెందుకు బయలుదేరుతున్నానని.. ఒక్క ట్రిపుల్ ఐటీ నిర్వహణ కూడా కేసీఆర్ కి సాధ్యం కావడం లేదని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇంకా ట్రిపుల్ ఐటి ఎలా మంజూరు చేస్తారు ? సిల్లి ముఖ్యమంత్రి కి సమస్యలు సిల్లిగా కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు సిల్లి అయితే… ఎందుకు పరిష్కరించలేదని మండిపడ్డారు. టిఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారడం.. ఆ వెంటనే విఆర్ఎస్ పొందటం ఖాయమని తేల్చి చెప్పారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులకు నీళ్లు, పవర్ కట్ చేయడం మూర్ఖత్వమని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version