బ్రేకింగ్ : తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బీజేపీ వార్నింగ్‌

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడి పై క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మ‌ల్ల‌న్న నిర్వ‌హించిన… పోల్ వివాద‌స్పదంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌నే కుదేపిస్తుంది. ఇప్ప‌టికే టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు…నిన్న రాత్రి తీన్మార్ మ‌ల్ల‌న్న పై దాడి చేయ‌గా… తాజాగా తీన్మార్ మల్ల‌న్న కు బీజేపీ పార్టీ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

తీన్మార్ మ‌ల్ల‌న్న ఫోన్ చేసి మ‌రీ.. బీజేపీ పార్టీ పెద్ద‌లు మందలించిన‌ట్లు స‌మాచారం అందుతోంది. వ్య‌క్తి గ‌త దూష‌ణ‌లు బీజేపీ పార్టీ సిద్ధాంతం కాద‌ని నేత‌లు చెప్పిన‌ట్లు స‌మాచారం అందుతోంది. వ్య‌క్తి గత విమ‌ర్శ‌లు చేయ‌కూడ‌ద‌ని.. డైరెక్ట్ గా బీజేపీ పెద్ద‌లే వార్నింగ్ ఇచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇలాంటి వ్యాఖ్య‌లు ఎవ‌రూ మాట్లాడినా.. త‌ప్పేన‌ని.. త‌మ పోరాటం కేవ‌లం కేసీఆర్‌, కేటీఆర్ విధానాల‌పై అని.. బీజేపీ నేత ప్ర‌కాష్ రెడ్డి అన్నారు. మ‌ల్ల‌న్న పై భౌతిక దాడి స‌రికాద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version