త్వరలోనే ఈపీఎఫ్ఓ శుభవార్త.. భారీగా పెరగనున్న మినిమమ్ పెన్షన్..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. దీనితో బెనిఫిట్ గా ఉండనుంది. ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ ని పెంచనున్నట్టు తెలుస్తోంది. మినిమమ్ పెన్షన్ పెంపుపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తాజాగా వచ్చిన రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనిపై ఇప్పటికే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తన ప్రతిపాదనలను ఈపీఎఫ్ఓకి అందించాయి.

 

 

229వ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనుందని అంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మినిమమ్ పెన్షన్‌ను వెయ్యి రూపాయల నుంచి పెంచాలని చాలా కాలం నుండి కూడా డిమాండ్ వుంది. అయితే ఈ విషయం పై కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఛైర్మన్‌షిప్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.

మార్చి 2021న కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మినిమమ్ పెన్షన్‌ను వెయ్యి రూపాయల నుంచి పెంచాలని అన్నారు. ఈ మొత్తాన్ని కనీసం రూ.9 వేలకు పెంచాలని పెన్షనర్లు చెబుతున్నారు. 5 రాష్ట్రాల హైకోర్టులు పెన్షన్‌ను ప్రాథమిక హక్కుగా గుర్తించాయని ఈపీఎఫ్ఓ బోర్డు సభ్యుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ విర్జేష్ ఉపాధ్యాయ్ అన్నారు.

దీని సీలింగ్‌ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే పదవీ విరమణకు ముందు చివరి నెలలో ఉండే శాలరీని బట్టి పెన్షన్‌ను మార్చాలని చాల కాలం నుండి డిమాండ్స్ వస్తున్నాయి. అధికారిక రంగంలో పనిచేసిన ఉద్యోగులకు 58 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుంది. అయితే దీని కోసం ఉద్యోగులు కనీసం పదేళ్ల పాటు తప్పనిసరిగా ఉద్యోగంలో ఉండాలి. ఈ స్కీమ్ కింద, ఎంప్లాయీ పేరు మీద 12 శాతం మొత్తాన్ని ఎంప్లాయర్ ఈపీఎఫ్‌లో జమ చేయాలి. దీంతో ఉద్యోగులు 58 ఏళ్ల తర్వాత వెయ్యి రూపాయిలు మినిమమ్ పెన్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version