హర్యానా పాలిటిక్స్‌లో బీజేపీ కొత్త ఎత్తులు.. మాజీ సీఎంపై గ్యాంగ్ స్టర్ భార్య పోటీ!

-

హర్యానా అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో బీజేపీకి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. కారణం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతుల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు పక్కపక్కన ఉండటం, గతంలో కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను ఈ రెండు రాష్ట్రాల రైతులే తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, మరోసారి బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలి. అందుకోసం కమలనాధులు కొత్త ఎత్తులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా పోటీ చేస్తున్న నియోజకవర్గం గార్హీ నుంచి బీజేపీ మాజీ గ్యాంగ్ స్టర్ భార్యను నిలబెట్టాలని యోచిస్తోంది. గ్యాంగ్ స్టర్ రాజేశ్ సర్కార్ భార్య మంజు హుడాను బరిలో నిలిపినట్లు కథనాలు వస్తున్నాయి.మాజీ డీఎస్పీ ప్రదీప్ కూతురైన ఆమె ప్రస్తుతం రోహ్‌తక్ జిల్లా చైర్ పర్సన్‌గా ఉన్నారు. భర్త గ్యాంగ్ స్టర్, తండ్రి సీనియర్ పోలీస్ కావడంతో స్థానికంగా మంజూకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాగా, అక్టోబర్ 5న హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version