టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు బిజెపి ప్లాన్.. ఏకంగా 88 ఆర్టిఐ దరఖాస్తులతో!

-

టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు బిజెపి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఎనిమిది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీయడం లో భాగంగా బీజేపీ తెలంగాణ శాఖ ఆర్టిఐ ని ఆయుధంగా వాడుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా దరఖాస్తులను ఆర్టీఐ ద్వారా దాఖలు చేయాలని పార్టీకి అనుబంధంగా ఉన్న యువ మోర్చాలు, పార్టీ రాష్ట్ర నాయకులు వివిధ అంశాలపై ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది.

కాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత నెల 28వ తేదీన 88 దరఖాస్తుల ద్వారా సమాచారం కోరుతూ.. వివిధ ప్రభుత్వ శాఖల్లో దరఖాస్తులు దాఖలు చేశారు. అందులో కొన్ని టి వివరాలు చూద్దాం..1)  2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా, వివిధ సమావేశాల్లో, సభల్లో ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్‌రావుగారు ఇచ్చిన హామీల వివరాలు ఇప్పించగలరు. 2) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్‌రావు గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? ఎన్ని పెండిరగ్‌లో వున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు.

3) ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్‌రావు గారు శాసనసభ, శాసనమండలిలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు (assurances) వివరాలను ఇప్పింగలరు. 4) శాసనసభ, శాసనమండలిలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌గారు ఇచ్చిన హామీల్లో (assurances) ఎన్ని అమలు అయ్యాయి? ఎన్ని పెండిరగ్‌లో ఉన్నాయి? వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 5) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్‌రావుగారు ఎన్నిసార్లు ఇప్పటివరకు రాష్ట్రసచివాలయానికి వచ్చి తమ విధులను నిర్వర్తించారో పూర్తి సమచారాన్ని ఇప్పించగలరు.

6) ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్‌రావు గారు 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎన్నిరోజులు హైదరాబాదులోని అధికార నివాసంలో బసచేశారు, ఎన్నిరోజులు వ్యవసాయక్షేత్రంలో బసచేశారు. 7) ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్‌రావు గారు అధికారిక నివాసం ప్రగతిభవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఎంతఖర్చు చేసింది? వాటికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు? 8) ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతిభవన్‌ నిర్మాణం పనులు ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు పూర్తిచేశారు? వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు?

Read more RELATED
Recommended to you

Exit mobile version