దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తోంది. కోవిడ్ సోకి కోలుకోవడం ఒకెత్తయితే తరువాత ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం ఇంకో సమస్యగా మారింది. ఈ క్రమంలోనే కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కొత్తగా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్ బారిన పడ్డవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.
బ్లాక్ ఫంగస్ బారిన పడ్డవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.
* కళ్ల, ముక్కు చుట్టూ ఎరుపు రంగులోకి చర్మం మారుతుంది. నొప్పి కలుగుతుంది.
* జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
* రక్తంతో కూడిన వాంతులు అవుతాయి. మానసిక స్థితి మారుతుంది.
* షుగర్ పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారికి డాక్టర్లు జాగ్రత్తగా చికిత్సను అందించాలి. ఐసీయూలలో ఉంచి చికిత్సను ఇవ్వాలి. షుగర్ నియంత్రించే మందులను వాడడంతోపాటు స్టెరాయిడ్‌లను ఇవ్వాలి. ఎప్పటికప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను పరీక్షించాలి. ఆక్సిజన్ థెరపీ ఇచ్చేటప్పుడు శుభ్రమైన, స్టెరైల్ వాటర్‌ను ఉపయోగించాలి. యాంటీ బయోటిక్స్, యాంటీ ఫంగల్స్‌తో చికిత్సను ఇవ్వాలి.
బ్లాక్ ఫంగస్ బారిన పడ్డవారు మాస్కులను విధిగా ధరించాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. కరోనా మాదిరిగానే అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇంట్లో ఇతరులకు ఈ వ్యాధి రాకుండా చూసుకోవాలి. వీలైనంత భౌతిక దూరం పాటించాలి. కనీసం 4-6 వారాల పాటు యాంటీ ఫంగల్ థెరపీ తీసుకోవాలి. అన్ని వైద్య పరీక్షలను నిరంతరం చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు https://www.ijmr.org.in/temp/IndianJMedRes1392195 -397834_110303.pdf అనే సైట్‌ను సందర్శించవచ్చు.