BREAKING : భారత్ -న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా

-

 

హైదరాబాద్‌ వేదికగా, న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఈ నెల 18న అంటే రేపు జరుగనుంది.ఈ నేపథ్యంలోనే.. మొన్న న్యూజిలాండ్‌ హైదరాబాద్‌ రాగా, నిన్న టీమిండియా వచ్చింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా, భారత్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది.

సోషల్ మీడియా లో బ్లాక్ లో టికెట్లు అమ్మకాలపై ప్రకటనలు చేస్తున్నారు. వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్ కు చెందిన 20 టికెట్లు ఒక్కోటి 3,000గా అమ్ముతున్నారు. కావాలంటే ఫలానా నంబర్లు సంప్రదించాలంటూ పోస్టింగ్ లు పెట్టారు కేటుగాళ్ళు. 1,500 టికెట్ను రెట్టింపు ధరకు బహిరంగంగా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. అయితే, బ్లాక్ మార్కెట్ దందాపై రాచకొండ SOT పోలీసులు నిఘా పెట్టారు. ఈ నెల 13న 6,000, 14న 7,000, 15న 7,000, 16న 9,417 టికెట్లను పేటీఎం ద్వారా హెచ్ సీఏ అమ్మకాలు నిర్వహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version