సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ట్రైన్‌లో విమానంలో లేని సదుపాయాలు వున్నాయి.. అవేంటంటే..!

-

సికింద్రాబాద్, విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదలైంది. జనవరి 15న ఈ ట్రైన్‌ను మోడీ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇది గుడ్ న్యూస్ ఏ. రైలు ప్రయాణం చేసే వాళ్లకి ఇది చాలా బాగుంటుంది. ఈ హైస్పీడ్ రైలు వల్ల ప్రయాణ సమయం దాదాపుగా 4 గంటల జర్నీ తగ్గుతుంది. అలానే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ లో ప్రయాణికులకు మరెన్నో ఫెసిలిటీస్ కూడా వున్నాయి.

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణికులకు మరెన్నో ఫెసిలిటీస్ కూడా లభిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ లో సదుపాయాల గురించి చెప్పారు. విమానాల్లో ఉన్న సౌకర్యాల కన్నా ఈ ట్రైన్‌ ఇంకా మెరుగైన సదుపాయాలు వున్నాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో, పూర్తిగా దేశీ పరిజ్ఞానంతో దీన్ని తీసుకు వచ్చారు.

ఎయిర్ రెసిస్టెన్సీ తక్కువగా ఉంటుంది. ఎనర్జీ వినియోగం కూడా ఈ కొత్త ట్రైన్‌లో 30 శాతం తక్కువగా వుంటుందట. అలానే ఈ ట్రైన్ లో సీట్స్ 180 డిగ్రీ రొటేట్ అవుతాయి. బుక్ రీడింగ్ లైట్స్ కూడా వున్నాయి. ప్రతి కోచ్‌లో జీపీఎస్ ఫెసిలిటీ, ఫ్లయిట్ లో వున్నట్టే డైనింగ్ టేబుల్ ఫెసిలిటీ కూడా దీనిలో వుంది.

ఈ రైలు లో వెడల్పుగా కిటికీలు ఉండడం తో సైట్ సీయింగ్ బాగా కనపడుతుంది. ఈ ట్రైన్ జర్నీ ప్రయాణికులకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ రైలు లో వున్న లెగ్ స్పేస్, రొటేషన్ వంటివి విమానాల్లో కూడా లేవు. ఈ ట్రైన్ గరిష్ట స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లు. అయితే ట్రాక్ గరిష్ట స్పీడ్ గంటలకు 130 కిలోమీటర్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version