టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి వ్యవస్థలను దిగజార్చారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. గవర్నర్ ని కలిసి వచ్చిన తర్వాత సిఎం క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని తాను అనుకోలేదని, ఇలాంటి పరిస్థితిని చూసి ఏపీ ప్రజలు చింతించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దారుణంగా వ్యవస్థలను దిగజార్చారు అని జగన్ ఆరోపించారు.
కరోనా వైరస్ గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్యారాసిటమాల్ వేసుకుంటే పోయే దానికి ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం ఏమి ఉందని ప్రశ్నించారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారికే ఈ వైరస్ తీవ్రంగా ఉందని, వాళ్ళే ఎక్కువగా చనిపోతున్నారని జగన్ అన్నారు. కేవలం 4.7 కేసులు మాత్రమే క్రిటికల్ గా ఉన్నాయని చెప్పారు. వైరస్ సోకినా వాళ్ళల్లో ఎక్కువగా 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళే చనిపోతున్నారని అన్నారు. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళు 65 వేల మందికి నయం అయిపోయింది అన్నారు.
పాజిటివ్ కేసుల్లో 80 శాతం ఇంట్లోనే నయమావుతున్నాయని చెప్పారు. ఇదేం భయానక వ్యాధి కాదని, ఎవరికి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గుండె, లివర్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకే ఈ వ్యాధి మరణం వరకు తీసుకు వెళ్తుంది అన్నారు. బ్లీచింగ్ పౌడర్ ఉంటే ఆ వైరస్ చనిపోతుంది అన్నారు. ఏపీ లో 70 కేసులు వస్తే ఒకటి పాజిటివ్ గా తేలింది అన్నారు. కరోనాపై అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని రెండు మూడు వారాల్లో నయం కాదని, ఏడాది పాటు సాగుతుంది అన్నారు.