ట్రెండ్ ఇన్: సమ్మర్ బ్లాక్ బాస్టర్..రికార్డుల వేటలో మహేశ్ ‘సర్కారు వారి పాట’

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ అంచనాలను మించి ఉందని మహేశ్ – కృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ ఇంకా యంగ్ గా కనిపించడంతో పాటు చాలా చక్కటి స్టోరిని ప్రజలకు చెప్పాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పరశురామ్ కథ, కథనం, మాటలు అదిరిపోయాయని అంటున్నారు. ఇక ఈ సినిమా రికార్డుల వేట కొనసా..గిస్తోంది. అతి త్వరగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఫిల్మ్ గా ‘సర్కారు వారి పాట’ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.180 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మహేశ్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు హౌజ్ ఫుల్ అవుతున్న ఫొటోలు, మహేశ్ బాబు ఫొటోలు, సర్కారు వారి పాట పోస్టర్స్ షేర్ చేస్తున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో #BlockbusterSVP బ్లాక్ బాస్టర్ ఎస్ వీపీ హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేస్తున్నారు. అలా నెటిజన్ల వరుస ట్వీ్ట్స్ తో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు- కీర్తి సురేశ్ లవ్ ట్రాక్, లారీ ఎపిసోడ్, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయని మహేశ్ బాబు అభిమానులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version