ప్రస్తుతం దేశంలో కరోనా ఏస్థాయిలో ఉందో చూస్తేనే ఉన్నాం. రెండోసారి లాక్‌డౌన్ వల్ల అన్ని రాష్ట్రా్లో క్రమక్రమంగా కేసులు తగ్గినప్పటికీ ఇప్పుడు మల్లీ లాక్ డౌన్ ఓపెన్ కావడంతో కేసులు పెరుగుతున్నాయి. ఇక ఏపీలో కూడా ఇప్పుడు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇంటర్ కాలేజీలు లేదా డిగ్రీ కకాలేజీలను ప్రభుత్వం ఏపీలో ఓపెన్ చేయకుండానే ఫలితాలను కూడా రీసెంట్‌గా ప్రకటించింది.
అంతే కాదు త్వరలోనే వాటికి సంబంధించిన మెమోలను కూడా విడుదల చేస్తామని తెలిపింది. ఇక విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే BIP.AP.GOVT.IN లో విద్యార్థులు తమ డౌట్లను రికార్డుచేస్తా వాటికి సమాధానం ఇస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. అంతే కాదు విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఇందులో అడగవచ్చని తెలిపింది.
ఇక ఇదే వెబ్ సైట్‌లో ఈ నెల 26 నుంచి మెమోలను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్టూడెంట్లకు స్పష్టం చేసింది బోర్డు. అలాగే విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే OUR.BIPAP@GMAIL కు పంపాలని బోర్డు వివరించింది. ఇక త్వరలోనే ఆన్ లైన్‌లోనే అడ్మిషన్లను కూడా నిర్వహిస్తామని స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలపాలని వివరించింది ఇంటర్ బోర్డు. ఇక త్వరలోనే సిలబస్‌పై కూడా క్లారిటీ ఇస్తామని వివరించింది.