అమరావతికి అదే వరం…

-

ఫార్ములా వన్ హెచ్2ఓ బోట్ రేసింగ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అందమైన ఈ అమరావతికి సుందరమైన నది ఉండటమే గొప్ప వరం అంటూ ఆయన పేర్కొన్నారు. ఏపీలో తొలిసారి బోట్ రేసింగ్ నిర్వహించుకోడం సంతోషంగా ఉందన్నారు.  గతంలో హైదరాబాద్ కు తీసుకురావాలని ఎంత ప్రయత్నించిన కుదరలేదు. ఇప్పుడు అంతకంటే మంచి పోటీలు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు.

రాష్ట్రంలో  70 నుండి 80 కిమీ నదీ తీరం ఉండడం మన అదృష్టమన్నారు. ఏపీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కృష్ణా నదిలో అందమైన ద్వీపాలున్నాయి.. దీంతో ప్రపంచ మేటి రాజధాని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా ఈ బోట్ రేసింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం,లోకేశ్ వర్షంలో తడుచుకుంటూ సందడి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version