ఆర్.ఆర్.ఆర్ లో జాన్వి..?

-

బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు రాజమౌళి ముందు అనుకున్నది శ్రీదేవినే.. కాని ఆమె ఎందుకో ఆ సినిమా వద్దనుకున్నారు. ఆ తర్వాత సినిమా సక్సెస్ ను చూసి అర్రె మంచి ఛాన్స్ మిస్సయ్యా అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో రాజమౌళి మాటల వల్ల శ్రీదేవి నొచ్చుకోవడం ఆ తర్వాత జక్కన్న రిగ్రేట్ ఫీల్ అవడం తెలిసిందే. ఇప్పుడు శ్రీదేవి లేరు ఆమె కూతురికి జక్కన్న అవకాశం ఇస్తున్నాడని తెలుస్తుంది.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. కరణ్ జోహార్ సలహా మేరకే రాజమౌళి జాన్విని తీసుకోనున్నాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో జాన్వికి ఛాన్స్ దక్కితే మాత్రం ఆమె కెరియర్ కు తిరుగు ఉండదని చెప్పొచ్చు.

ఈమధ్యనే దడక్ సినిమాతో అలరించిన జాన్వి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. మరి కరణ్ కోసం రాజమౌళి జాన్వికి ఛాన్స్ ఇస్తాడా లేడా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నవంబర్ 19 నుండి రెగ్యులర్ షూట్ జరుపనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version